హైడ్రా పేరుతో కొందరు అవినీతికి పాల్పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డుపెట్టుకొని అమాయకులను భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్నారని, కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులపై కూడా ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. అక్రమంగా డబ్బు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వసూళ్లకు పాల్పడే వారిపై దృష్టి పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులకు సూచించారు.