Homeహైదరాబాద్latest Newsసెక్రటేరియల్​లో సీఎం తమ్ముడి వసూళ్లు

సెక్రటేరియల్​లో సీఎం తమ్ముడి వసూళ్లు

– రాత్రి వరకు అక్కడే మకాం
– బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ సంచలన వ్యాఖ్యల

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్​ రెడ్డి తమ్ముడు రాత్రి వరకు సెక్రటేరియట్​ ఉంటూ ప్రతి పనికి వసూళ్లకు పాల్పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఆరోపించారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లో అవినీతి పెద్దఎత్తున జరిగిందని తెలిపారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి కోసం రూ.7,500 ఇచ్చినా చెక్కు రాలేదని కాంగ్రెస్ నాయకుడిని లబ్ధిదారులు నిలదీసిన ఘటనపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం తమ్ముడు సచివాలయంలో రాత్రి పైసల వసూళ్ల కార్యక్రమంలో బిజీగా ఉంటున్నారని, మంత్రులంతా ఇదే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ నాయకులంతా అవినీతిలో మునిగిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక పనులు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Recent

- Advertisment -spot_img