Homeహైదరాబాద్latest Newsకలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మిక తనిఖీ.. ఎరువుల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశాలు

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మిక తనిఖీ.. ఎరువుల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశాలు

ఇదే నిజం, ముస్తాబాద్: పోత్గల్ లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పీ.ఏ.సీ.ఎస్. లలో ఈ-పాస్ యంత్రాలను, నిల్వ ఉన్న యూరియా స్టాక్ ను పరిశీలించారు. ఎరువులు ఎంత ధరకు విక్రయిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తగా స్టాక్ ఉండాలని ఆదేశించారు. ఈ పర్యటన లో డీ.సీ.హెచ్.ఎస్. మురళీధర్ రావు, డాక్టర్లు శ్రీనివాస్, సిందూజ, నర్సులు, సిబ్బంది,జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, మండల వ్యవసాయ అధికారి వెంకటేష్, పీఏసీఎస్ సీవో కృష్ణ భార్గవ్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img