Homeజిల్లా వార్తలుకామారెడ్డి జిల్లాలో 351 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్న కలెక్టర్..!

కామారెడ్డి జిల్లాలో 351 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్న కలెక్టర్..!

ఇదే నిజం, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో 351 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై శుక్రవారం కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఐకేపీ ఆధ్వర్యంలో 23, సహకార సంఘాల ఆధ్వర్యంలో 328 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సన్న ధాన్యం విక్రయించే రైతులకు ప్రభుత్వం క్వింటాల్ రూ.500 బోనస్ ఇస్తుందన్నారు.

అక్టోబర్ రెండో వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లాలో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. గన్ని సంచులు, ప్యాడి క్లీనర్స్, టార్పాలినులు సిద్ధం చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీటి వసతి, టెంటు సౌకర్యం కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు, సివిల్ సప్లై మేనేజర్ రాజేందర్, సహాయ సివిల్ సప్లై అధికారి నరసింహారావు, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డీసీవో రామ్మోహన్, ఎల్ డీఎం రవికాంత్, మార్కెటింగ్ అధికారి రమ్య పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img