Homeతెలంగాణప్రెస్​ క్లబ్​ భవనానికి స్థలాన్ని కేటాయిస్తాం..

ప్రెస్​ క్లబ్​ భవనానికి స్థలాన్ని కేటాయిస్తాం..

హరిత హారంలో జర్నలిస్టులు భాగస్వాములు కావాలి.. జిల్లా కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లు..

జవహర్​ నగర్​, ఇదే నిజం: అనునిత్యం ప్రభుత్వానికి, ప్రజలకు వారదిగా ఉండే జర్నలిస్టుల సేవలు మరువలేనివని, వారికి కావాల్సిన ప్రెస్​ క్లబ్​ భవన నిర్మాణానికి స్థలాన్ని త్వరలోనేఏర్పాటు చేస్తామని మేడ్చల్​–మల్కాజిగిరి కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో భాంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని అంబేద్కర్ నగర్ హైస్కూల్ల్లో బుధవారం మొక్కలు నాటారు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, మేయర్ మేకల కావ్య, డిప్యూటి మేయర్​ రెడ్డిశెట్టి శ్రీనివాస్​, కార్పొరేషన్​ కమీషనర్​ నేతి మంగమ్మ, ఎంఆర్​ఓ గౌతం కుమార్​.

ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు జిల్లా పరిధిలో 63 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారని, ఇప్పటివరకు 72 లక్షల మొక్కలు నాటడంతోపాటు అర్బన్ ట్రీ పార్క్లను ఏర్పాటు చేశామన్నారు. కాలీ స్థలాలు ఎక్కడ ఉంటే అక్కడ మొక్కలు నాటడంవలన పచ్చదనం పెరిగి అనారోగ్యాల భారిన పడకుండా ఉండవచ్చన్నారు. అలాగే ప్రతి ఒక్కరు తమ విధిలో భాగంగ మొక్కలు నాటాలన్నారు.

అనంతరం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తాము ఏర్పాటు చేసుకున్న ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని ప్రెసిడెంట్ మార్కండేయ, జనరల్ సెక్రెటరి పరమేష్ యాదవ, కమిటీ సభ్యులు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు వినతి పత్రాన్ని అందించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ త్వరలోనే ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో ప్రెస్​ క్లబ్​ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img