ఇదే నిజం, కామారెడ్డి: ఎలారెడ్డి వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో శుక్రవారం రాత్రి ఆయన బస చేశారు. శనివారం ఉదయం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం మైనారిటీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద విద్యార్థుల చదువుల కోసం ఎంతో కృషి చేస్తుందని.. అధికారులు విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని సూచించారు. ప్రతి విద్యార్థి రెండు మొక్కలను దత్తత తీసుకొని కాపాడాలన్నారు. మొక్కలతోనే మానవ మనుగడకు ఆధారం నెలకొందని ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంపై శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. అనంతరం ఎల్లారెడ్డిలోని పారిశుధ్య పనులను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవో ప్రభాకర్, ఎస్ఎస్ సీ సంక్షేమ శాఖ అధికారి దయానంద్,తదితరులున్నారు.