ఇదేనిజం, రాయికల్: రాయికల్ మండలంలోని అల్లిపూర్ గ్రామ పంచాయతీని, అంగన్వాడీ సెంటర్, పాఠశాలను కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామపంచాయతీలో పలు రిజిస్టర్లను పరిశీలించారు. పాఠశాలలో ఎంతమంది పిల్లలు ఉన్నారు? స్కూల్ యూనిఫామ్స్ ఇంకా ఎందుకు పంపిణీ చేయలేదన్నారు. అంగన్వాడి పిల్లల ఎత్తు, బరువు చూశారు. నర్సరీలను, రాయికల్ మున్సిపాలిటీలోని డ్రైనేజీ, చెరువులను, బోర్నపల్లిలోని ఇసుక డంపు పరిశీలించారు.