తెలంగాణలో నేటి నుంచి డిగ్రీ కాలేజీలు బందు పిలుపునిచ్చాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు మంగళవారం నుంచి నిరవధిక బంద్కు సిద్ధమయ్యాయి. రూ.2వేలకోట్ల బకాయిలు విడుదల చేసే వరకూ కాలేజీల బంద్ను కొనసాగిస్తామని, సెమిస్టర్ పరీక్షలనూ బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రకటించింది. ఈ బంద్ కాలేజీలు పాల్గొనాలని ఓ ప్రకటనలో పిలుపునిచ్చింది.