మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదని, ఆయన బలమైన శక్తిగా నిలుస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ.. ఖమ్మంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అపూర్వ మెజారిటీ వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఖమ్మం నుంచి ముగ్గురం మంత్రులం ఉన్నామని ఆయన అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం సీటును కైవసం చేసుకోవాలన్నారు. ఉమ్మడి వ్యవస్థ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.