Homeఎడిటోరియల్​Commercial Crops : వ్యవసాయంతో 3 నెలల్లో 3 లక్షలు సంపాదించే అవకాశం

Commercial Crops : వ్యవసాయంతో 3 నెలల్లో 3 లక్షలు సంపాదించే అవకాశం

Commercial Crops : వ్యవసాయంతో 3 నెలల్లో 3 లక్షలు సంపాదించే అవకాశం

Commercial Crops : రైతుల బాధలు అన్నీ ఇన్నీ కావు.

విత్తనాల నుంచి మొదలుకొని ధాన్యం అమ్మే వరకు.. ఎన్నో కష్టాలు పడతారు.

చివరకు తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక.. నష్టపోతుంటారు.

పెట్టుబడి కూడా వెనక్కిరాక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు.

ఐతే ఎప్పుడూ వేసే పంటలు కాకుండా.. కాస్త వెరైటీగా ట్రై చేస్తే మంచి లాభాలు గడించవచ్చు.

ఇక్కడ అలాంటి ఐడియానే ఒకటి చెప్పబోతున్నాం. అదే ఔషధ మొక్కల పెంపకం (Medicinal Plants Farming).

ప్రస్తుతం ఎన్నో ఆయుర్వేద మందులు, అల్లోపతి మందుల తయారీలోనూ ఔషధ మొక్కలను వాడుతున్నారు.

ఆ పంటలను పండిస్తే భారీగా ఆదాయం వస్తుంది. మార్కెటింగ్ ఇబ్బందులు కూడా ఉండవు.

మరి ఆ పంట ఏంటి? మార్కెటింగ్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

Average Land for Farmer : దేశంలో రైతు కుటుంబ సగటు భూమి ఎంతో తెలుసా

OBC Farmers : వ్యవసాయ కుటుంబాల్లో ఓబీసీలే అధికం..

Small Farmers : దేశంలో వ్యవసాయ కుటుంబాల్లో 90 శాతం చిన్న రైతులే…

మీకు పొలం ఉండి.. వ్యాపారం చేయాలని ఆసక్తి ఉంటే ఔషధ మొక్కల పెంపకం వైపు అడుగులు వేయవచ్చు.

ఔషధ మొక్కల ఎకరాలకు ఎకరాల స్థలం.. భారీగా పెట్టుబడి అవసరం లేదు.

పలు ఔషధ కంపెనీలతో ఒప్పందం చేసుకొని ఔషధ మొక్కలను పండించాలి.

మన దేశంలో సహజ ఉత్పత్తులు, ఔషధాల మార్కెట్ చాలా పెద్దది.

అందులో ఉపయోగించే సహజ ఉత్పత్తులకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది.

అన్ని కాలాల్లోనూ ప్రజలకు వీటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం చాలా కంపెనీలు కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఔషధ మొక్కలను సాగు చేస్తున్నాయి.

వాటి సాగు ప్రారంభించడానికి కొన్ని వేల రూపాయలు పెట్టుబడిగా పెడితే చాలు.. ఆదాయం లక్షల్లో ఉంటుంది.

కేవలం రూ. 90 వేల పెట్టుబడితో నెలకు రూ. 40 వేల ఆదాయం.. ఈ బిజినెస్ ఐడియా మీ కోసమే..

తులసి, ఆర్టెమిసియా అన్నూ, లికోరైస్, అలోవెరా.. ఈ మొక్కలను చాలా రకాలల ఔషధాల్లో వాడుతున్నారు.

ఈ మొక్కలను పెంచితే మంచి ఆదాయం వస్తుంది. తక్కువ సమయంలోనే పంట కూడా చేతికి వస్తుంది.

వీటిని పంటల పొలాల్లోనే పెంచాల్సిన అవసరం లేదు. మీ వద్ద ఖాళీ స్థలం ఏదైనా ఉంటే.. అక్కడ చిన్న కుండీలలో కూడా పెంచుకోవచ్చు.

ఈ రోజుల్లో ఔషధ మొక్కల కొనుగోలు కోసం రైతులతో ఒప్పందాలు చేసుకునే ఫార్మాస్యూటికల్ కంపెనీలు చాలానే ఉన్నాయి.

పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు రైతులకు ఈ అవకశం కల్పిస్తున్నాయి. ఆదాయం పట్ల కూడా హామీ ఇస్తున్నాయి.

తులసి మొక్క (Basil Plant)ను హిందువులు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తున్నారు.

మహిళల ఉదయాన్నే తలస్నానం చేసి తులసి కోటకు పూజ చేస్తారు.

అంతేకాదు ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వీటిలో యూజినాల్ మరియు మిథైల్ సిన్నమేట్ ఉంటాయి.

క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు మందులు తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు.

అందుక తులసి మొక్కలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

Passport without Broker : బ్రోకర్​ లేకుండా రూ.1500 లకే పాస్‌పోర్ట్‌ ఎలా..

Court Writs : ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన రిట్లు, వాటి అర్థం, ఉద్దేశం

Promissory Note : ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాస్తే అప్పు ఇచ్చిన వాడు చచ్చినా మీ డబ్బు వెనక్కి వస్తుంది..

1 హెక్టారులో తులసి పండించడానికి కేవలం 15 వేల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది.

అయితే 3 నెలల తర్వాత ఈ పంటను సుమారు 3 లక్షల రూపాయలకు అమ్ముకోవచ్చు.

పతంజలి, డాబర్, వైద్యనాథ్..వంటి ఆయుర్వేద ఔషధాలను తయారు చేసే కంపెనీలతో కలిసి ఒప్పంద వ్యవసాయం చేయవచ్చు.

ఆ కంపెనీ వారే విత్తనాలు సరఫరా చేస్తారు. రైతులకు సాగు చేసి ఇవ్వాల్సి ఉంటుంది.

మళ్లీ వారే వచ్చి పంటను తీసుకెళ్తారు. తద్వారా రైతులకు మార్కెటింగ్ రిస్క్ ఉండదు.

తులసి గింజలు మరియు నూనెకు కూడా పెద్ద మార్కెట్ ఉంది. మార్కెటింగ్ పట్ల అవగాహన ఉన్న వారు సొంతంగా కూడా కంపెనీలకు విక్రయించవచ్చు.

ఐతే ఔషధ మొక్కల పెంపకంలో రైతులు మెలకువలు నేర్చుకోవాలి. భవిష్యత్తులో నష్టపోకుండా ఉండేందుకు మంచి శిక్షణ అవసరం.

లక్నోకు చెందిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్ (CIMAP) ఔషధ మొక్కల పెంపకానికి శిక్షణనిస్తుంది.

CIMAP ద్వారా ఫార్మాస్యూటికల్ కంపెనీలు మీతో ఒప్పందాలు కుదుర్చుకుంటాయి.

కాబట్టి మీరు అక్కడ మరియు ఇక్కడకు వెళ్లవలసిన అవసరం లేదు. కంపెనీ ప్రతినిధులే మీ పొలానికి వస్తారు.. మీ పంటను తీసుకెళ్తారు.

Recent

- Advertisment -spot_img