Homeహైదరాబాద్అక్రమ నిర్మాణాల కోసమేనా కమీషనర్​ బదిలీ డిమాండ్​..

అక్రమ నిర్మాణాల కోసమేనా కమీషనర్​ బదిలీ డిమాండ్​..

మేడిపల్లి, ఇదేనిజం : బోడుప్పల్లో కార్పొరేషన్లో అక్రమ నిర్మాణాలపై కోరడా ఝులించినందుకు కమీషనర్ బదిలి చేయమని సంతకాల సేకరణ చేయడం ఎంతవరకు సమంజసమని బోడుప్పల్ మున్సినల్ కాలనీల సంక్షేమ సంఘాల చైర్మెన్ రాపోలు రాములు అన్నారు . శుక్రవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పాలకమండలి ఏర్పడి 8 మాసాలైనప్పటికి ఇప్పటివరకు అభివృద్ధి పై దృష్టి సారించడం విఫలమైన పాలకవర్గం అక్రమ కట్టడాలు కబ్జాలకు సహకరిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు అని విమర్శించారు. కార్పొరేటర్లు కమీటిగా ఏర్పాటు చేసుకొని డివిజన్​లో నిర్మాణాలను ప్రోత్సహిస్తు అంతస్తుకు ఇంత అని రేటు పెట్టి వసూలకు పాల్పడుతున్నారని, డబ్బు బలంతో కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచాం, మా మాట వినడం లేదు, అభివృద్ధి కుంటుపడటానికి కమీషనర్ కారణం అనే బూచీలో అతనిని ఐదీలి చేయడానికి కార్పోరేటర్లు లాందరూ మేయర్ నేతృత్వంలో కార్పోరేటర్లు సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి మల్లారెడ్డికి అందించడానికి సిద్ధం చేశారని, నితీనిజయితీగా పనిచేస్తూ అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో కార్పోరేటర్​లకు మింగుడు పడటం లేదని తెలిపారు. కార్పోరేటర్​ల మాట వినక చెరువులను, నాలాలను కబ్జా చేస్తున్నారని అధికారులు కూల్చడానికి వెలితే మంత్రుల పేర్లు చెపుతూ , నాలాలు కబ్జా గురియకున్నాయని పాత్రికేయులు సందర్శిస్తే వారిని తెలంగాణ మంత్రుల పేర్లు చెప్పి బెదిరింపులకు గురి చేస్తూ మేము అధికార పార్టీ ప్రజాప్రతినిధులమని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. నిజాయితిగా ఉదోగ్యం నిర్వహిస్తున్న కమీషనర్​కు సమాఖ్య ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షుడు కలుకూరి రాములు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ప్రకాష్ ముఖ్య సలహాదారులు ఎడ్ల శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు జి.నర్సింగ్ యాదవ్​, పంగ రమేష్ , బొల్లారం మహేష్, వి.ప్రవీణ్ కుమార్, చిలుక వాస్కర్ రాజాస్వామి, ఎలగందులు రాములు, ఎల్ . రాజిరెడ్డి, మరాటి మత్సగిరి , బాల్ రెడ్డిలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img