హైడ్రా పేరుతో ఎవరైనా బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే అలాంటి వారిని జైలుకు పంపుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, హైడ్రా ఉన్నతాధికారులతో తమకు పరిచయాలున్నాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసిందన్నారు. ఎవరైనా డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడితే స్థానిక పోలీస్ స్టేషన్లలో, ఏసీబీకి ఫిర్యాదు చేయాలని సూచించారు