మెగా డాటర్ నిహారిక సమర్పణలో యదు వంశీ తెరకెక్కించిన యుత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’. ఎంతో మంది కొత్త నటీనటుల్ని వెండితెరకు పరిచయం చేసిన ఈ సినిమా యువతను విశేషంగా ఆకట్టుకుని విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన తక్కువ బడ్జెట్ సూపర్ హిట్ రూరల్ కామెడీ డ్రామా ఇది. థియేటర్లలో విజయవంతంగా ఆడిన తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఈటీవీ విన్ వేదికగా ఈరోజు నుంచి ప్రసారం కానుంది.