Homeహైదరాబాద్latest Newsప్రజావ్యతిరేక విధానాలపై కమ్యూనిస్టులు ఏకమై ప్రజల్ని చైతన్యం చేయాలి: యంసిపిఐ(యు) పోలిట్ బ్యూరో  సభ్యులు కామ్రేడ్...

ప్రజావ్యతిరేక విధానాలపై కమ్యూనిస్టులు ఏకమై ప్రజల్ని చైతన్యం చేయాలి: యంసిపిఐ(యు) పోలిట్ బ్యూరో  సభ్యులు కామ్రేడ్ కాటం నాగభూషణం.

ఇదేనిజం శేరిలింగంపల్లి: దేశంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్ని చైతన్యం చేసి పోరాడేందుకు కమ్యూనిస్టులం ఏకంకావాలని లేకపోతే  ప్రజలలో మరింత పలుచనయి పోతామని ఎంసిపిఐ(యు) పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ కాటం నాగభూషణం  అన్నారు. మియాపూర్ ముజఫర్ అహ్మద్ నగర్ లో రెండు రోజులపాటు జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ .. అధికారం కోసం సీట్లు తగ్గినా, పాలనలో గతం కంటే ఎక్కువ ప్రజా వ్యతిరేక విధానాలను చేపట్టిన పరిస్థితి రాష్ట్రాల హక్కులను హరిస్తున్న తీరు, దేశం లో అట్టడుగు వర్గాల పై పెరిగిన దాడులు అన్ని బీజేపీ మతోన్మాద ఫాసిస్టు దృక్పథం స్పష్టం చేస్తుందన్నారు.  ఈ  ప్రమాదం గుర్తించి దేశంలో కమ్యూనిస్టు పార్టీ లు అన్ని ఏకం కావడం లేదా కనీస అంగీకృత కార్యక్రమం రూపోందించుకొని దేశంలో నియంతృత్వ మనువాద, కార్పోరేట్ ఫాసిస్టు, దోపిడీ పాలకవర్గం కు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని అందులో బాగంగా యంసిపిఐ(యు) – ఆర్ యం పి ఐ లతో కమ్యూనిస్టు కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి ఏకం కావడానికి నిర్ణయం చేసుకున్నామని మిగితా శక్తులను ఏకం చేయటానికి యంసిపిఐ(యు) పూనుకుంటుందని ఈ దశలో కమ్యూనిస్టులు అంతాకలిసి రావాలన్నారు.
  యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి గారు మాట్లాడుతూ యంసిపిఐ(యు) పార్టీ ఆద్వర్యంలో గత 40 సంవత్సరాల నుండి పోరాడి సాధించుకున్న మియాపూర్ డివిజన్ ముజఫర్ అహ్మద్ నగర్ బస్తీ వాసులకు నోటీసు లు ఇవ్వటం సరైన చర్య కాదని ఈ ప్రాంతం లో వందలాది కోట్ల రూపాయల విలువైన భూములను భూకబ్జా దారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారు, సత్యవాణి లాంటి వారు వందలాది ఎకరాల భూములను అక్రమంగా ఆక్రమించి, చెరువు కుంటలు, శిఖం భూములు ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వారిజోలికి వెళ్లకుండా జానెడు జాగా లో ఇండ్లు నిర్మాణం చేసుకున్న పేద ప్రజలకు నోటీసు లు ఇవ్వటం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశం లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ వల్లెపు ఉపేందర్ రెడ్డి, వనం సుధాకర్,కుంభం సుకన్య, వరికుప్పల వెంకన్న, ఎన్ రెడ్డి హంసా రెడ్డి,వి.తుకారాం నాయక్, గోనె కుమారస్వామి,మంద రవి, రాష్ట్ర కమిటీ సభ్యులు మాలోతు జబ్బర్ నాయక్, మైదంశెట్టి రమేష్, నర్రా ప్రతాప్, కంచ వెంకన్న, గుండె బోయిన చంద్రయ్య, కుసుంబ బాపురావు, పల్లె మురళి, వంగాల రాగసుధ, తాండ్ర కళావతి, అంగడి పుష్ప, పి. బాగ్యమ్మ, కనుకం సంద్య, గడ్డం నాగార్జున, మాస్ సావిత్రి పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img