ఇదే నిజం మందమర్రి: మందమర్రి పట్టణంలో నేరాలు నియంత్రించేందుకు, ప్రజలకు దగ్గర అయ్యేందుకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బెల్లంపల్లి ఎసిపి రవికుమార్ తెలిపారు. శనివారం మందమర్రి పట్టణంలోని ఎస్సీ ఎస్టీ కాలనీలో రామగుండం కమిషనర్ శ్రీ వి శ్రీనివాసరావు (ఐపీఎస్) ఐజి , మంచిర్యాల డిసిపి ఏ.భాస్కర్ గారి ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసిపి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని 54 ద్విచక్ర వాహనాలను, 06 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసిపి తెలిపారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం, సెక్యూరిటీ కల్పించడం గురించి, ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుసుకునేందుకు మరియు చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారా వంటి విషయాలు తెలుసుకెందుకు ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
వాహన దారులు తప్పకుండా అన్ని డాక్యుమెంట్స్ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, పొల్యూషన్, ఇన్స్యూరెన్స్ కలిగి ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి కొత్త చట్టాలలో జరిమానాలు, శిక్షలు పెంచడం జరిగిందన్న విషయన్ని ప్రజాలు గ్రహించాలని అన్నారు.
మహిళల భద్రతే పోలీస్ ప్రధాన లక్ష్యం అని, మహిళ పట్ల, చిన్న పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, వారిని మానసిక, శారీరకంగా హింసించిన వారిపట్ల చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టి కేసులు నమోదు చేయడం జరుగుతుంది. వారి రక్షణ కోసం షి టీమ్స్ నిరంతరం పని చేస్తున్నాయని అన్నారు. వాహనాలకు సంబంధించి సరైన ధృవ పత్రాలు చేక్ చేసి తమ వాహనాలు తిరిగి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన, యువకులు గుంపులు గా ఏర్పడి బహిరంగ మద్యపానం సేవించిన, ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రజల రక్షణ కొరకు పోలీసులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారు అని తెలిపారు. వ్యాపార సముదాయాల దగ్గర, కాలనీ లలో, మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఏసిపి తెలిపారు. మీ కాలనీ లో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీస్ లేదా డయల్ 100 కు ఫోన్ చేసిన వెంటనే చర్యలు చేపడతామన్నారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు.
అలగే సైబర్ నేరాల పాట్ల జాగ్రత్తగా ఉండాలనీ, మొబైల్ ఫోన్స్ లను జాగ్రత్తగా వినియోగించాలని, చిన్న చిన్న తప్పులతో విలువైన డబ్బులను పోగొట్టుకోవద్దు అని, ఎవరైనా సైబర్ నేరాల కు గురైతే వెంటనే 1930 కు కాల్ చేయలని లేదా లోకల్ పోలీస్ లను సంప్రదించాలని అన్నారు. అనంతరం పొక్సో కేసుల నమోదు, శిక్షలు, బాల్య వివాహాలు, బాల్య కార్మిక వ్యవస్థ పర్యవ్యాసనల గురించి, ట్రాపిక్ రూల్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, మందమర్రి ఎస్సై రాజశేఖర్, కాసిపేట ఎస్సై ప్రవీణ్ కుమార్, రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్, దేవపూర్ ఎస్సై ఆంజనేయులు, ఆర్ఎస్ఐ వెంకట్, మందమర్రి సర్కిల్ పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.