– జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర రావు
– ఇప్పటివరకు చోరికి గురైన 198 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత
ఇదేనిజం, జగిత్యాల టౌన్: మొబైల్ ఫోన్ చోరీకి గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు సూచించారు. సీఈఐఆర్ టెక్నాలజీ ద్వారా తిరిగి మొబైల్ ఫోన్ ఎక్కడ ఉందో గుర్తించవచ్చని చెప్పారు. జిల్లాలో చోరీకి గురైన 198 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశామని చెప్పారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చోరి గురైన 32 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మొబైల్ ఫోన్లో రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్, ఆర్ఎస్సై దినేశ్, కృష్ణ, సైబర్ క్రైమ్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ బీ ఇన్ స్పెక్టర్ నాగేశ్వర రావు, ఆర్ఐ జానీమియా, ఆర్ఎస్సైలు దినేశ్, కృష్ణ, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.