కొద్ది రోజుల్లోనే 2023-24 ఆర్థిక సంవత్సరం ముగియబోతోంది. ఈ క్రమంలోనే ఎన్నో పర్సవల్ ఫైనాన్స్ సంబంధిత డెడ్‌లైన్స్ ముగుస్తున్నాయి. వీటిల్లో అప్‌డేటెడ్ ఇన్‌కంటాక్స్ రిటర్న్స్.. టాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్.. పీపీఎఫ్, ఎన్‌పీఎస్ వంటి పథకాల్లో డిపాజిట్లు.. ఎస్‌బీఐ, ఐడీబీఐ స్పెషల్ స్కీమ్స్ వంటి వాటి డెడ్‌లైన్ మార్చి 31. అందుకే ఈ పనులు చేయని వారు తొందరగా చేసుకోవడం మంచిది. అప్పుడే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉంటారు.