Homeతెలంగాణతెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం.. ఈ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోండి

తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం.. ఈ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోండి

తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే బుధవారం ప్రారంభమైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ సర్వేను ప్రారంభించారు. మొదటి మూడు రోజులు అధికారులు ఇళ్లకు స్టిక్కర్ అతికించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు వివరాలు సేకరించనున్నారు. సర్వేలో దాదాపు 85 వేల మంది ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేస్తారు. నవంబర్ 6 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఎన్యుమరేటర్లు ప్రభుత్వం ముద్రించిన ఫార్మాట్‌లో కుటుంబ వివరాలను సేకరించి నమోదు చేయనున్నారు. వీటిలో 56 ప్రధాన ప్రశ్నలు మరియు 19 అనుబంధ ప్రశ్నలు 75 ప్రశ్నలపై సమాచారాన్ని సేకరిస్తారు. ఎన్యూమరేటర్లు పార్ట్-1, పార్ట్-2 కింద 8 పేజీల్లో సంబంధిత వివరాలను నమోదు చేస్తారు. ఆధార్, ధరణి పాసుపుస్తకం, పాన్, రేషన్ కార్డు, సెల్ ఫోన్ నంబర్లు దగ్గర ఉంచుకోండి. ఆ పత్రాలను దగ్గర ఉంచుకోవడం మంచిది. ఒక్కో కుటుంబానికి సంబంధించిన వివరాల సేకరణకు 10-20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img