శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో క్యాబ్ డ్రైవర్‌లు ఆందోళనకు దిగారు. ఎయిర్ పోర్ట్‌లో ఇతర రాష్ట్రాల క్యాబ్‌లు నడపడం వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది క్యాబ్‌లను పార్కింగ్‌లో నిలిపివేసి క్యాబ్ డ్రైవర్స్ ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న క్యాబ్ డ్రైవర్‌లకు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో విమాన ప్రయాణికులు కొంత ఇబ్బందులను ఎదుర్కొన్నారు.