Homeహైదరాబాద్latest News"ప్రజల్లో నమ్మకం, ధైర్యం కలిగించాలి" : పోలీస్ కమిషనర్ అనురాధ

“ప్రజల్లో నమ్మకం, ధైర్యం కలిగించాలి” : పోలీస్ కమిషనర్ అనురాధ

ఇదేనిజం, చేర్యాల టౌన్: ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కోసం పోలీసు అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని సిద్ధిపేట జిల్లా పోలీస్ కమిషనర్ అనురాధ పేర్కొన్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లకు బుక్స్ పంపిణీ చేసి , గ్రామాల సమాచారాన్ని వారం రోజుల్లోగా పొందుపరచాలని ఆదేశించారు. రెండు మూడు రోజులకోసారి గ్రామాలను సందర్శించాలని సూచించారు. కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. గంజాయి ఇతర మత్తుపదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సంబంధిత విపిఓ ప్రత్యేక ఇన్ఫర్మేషన్ వ్యవస్థను రూపొందించుకోవాలని అన్నారు. ఇసుక, పిడిఎస్ రైస్ అక్రమ రవాణా జరగకుండా అరికట్టాలని సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని చెప్పారు.

“ఎన్నికల వేల ప్రజల్లో నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించడంలో ముఖ్యమైన పాత్రని వహించాలి. క్రిటికల్, నార్మల్ గ్రామాలు, పాత నేరస్తుల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే చర్యలు చేపట్టాలి. ఎన్నికల సమయంలో గొడవలను సృష్టించే వ్యక్తులను గుర్తించి వారి కదలికలపై నిఘా పెట్టాలి. ముఖ్యంగా ఎన్నికల వేళ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. ఓటర్లను మభ్యపెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలి.” అని కమిషనర్ అనురాధ వ్యాఖ్యానించారు. హుస్నాబాద్ ఏసీపీ సతీష్, చేర్యాల సీఐ శ్రీను, ఎస్ఐ దామోదర్, మద్దూర్ ఎస్ఐ యూనస్ అహ్మద్ అలీ, కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img