– పోలింగ్ సిబ్బందికి ఆర్డర్ కాపీలు అందక ఇబ్బందులు
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నది. పోలింగ్ సిబ్బందికి విధులకు సంబంధించి ఆర్డర్ కాపీలు ముందుగా ఇవ్వకపోవడంతో సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. అందరూ ఒకేసారి ఎగబడడంతో ఆర్డర్ కాపీలు కోసం సిబ్బంది మధ్య తోపులాట జరిగింది. అధికారుల తీరుపై ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.