జార్ఖండ్‌లో 18మంది బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో పలు ప్రశ్నలకు సీఎం హేమంత్ సోరెన్ సమాధానం ఇవ్వకపోవడంతో.. గురువారం ఉదయం స్పీకర్ రవీంద్రనాథ్ మహతో వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడటంతో శుక్రవారం మధ్యాహ్నం 2గంటల వరకు ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేలు బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్ బలవంతంగా వారిని బయటకుతీసుకెళ్లారు.