Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్, బీఆర్ఎస్ తోడు దొంగలు.. అమెరికాలో కేటీఆర్, రేవంత్ చీకటి ఒప్పందాలు.. ఎంపీ రఘునందన్ రావు...

కాంగ్రెస్, బీఆర్ఎస్ తోడు దొంగలు.. అమెరికాలో కేటీఆర్, రేవంత్ చీకటి ఒప్పందాలు.. ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు

  • మేడిగడ్డ, సుంకిశాల అంశాల్లో రెండు పార్టీల డ్రామాలు
  • రేవంత్ రెడ్డి దగ్గర మాటలు తప్ప చేతలు లేవు
  • మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
  • సంగారెడ్డిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తోడు దొంగలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. అమెరికా వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచే కేటీఆర్ తో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుంటారని ఆరోపించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మీడియాతో మట్లాడారు. కాళేశ్వరం, మెడిగడ్డ, సుంకిశాల విషయంలో రెండు పార్టీలు ప్రెస్ మీట్లతో సరిపెడుతున్నారు తప్ప యాక్షన్ లేదు అని, తప్పు చేసినోడు కొడుకైన, కూతురైన శిక్షించడానికి వెనుకాడనని కేసీఆర్ అన్నాడు కానీ ఆయన మనసు ఒప్పలేదన్నారు ఎంపీ రఘునందన్‌ రావు.

ఈనాడు రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు తప్ప చేతలు లేవు అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీల తీరు అత్త కొట్టింది కోడలు ఏడ్చింది అన్నట్టు ఉందన్నారు. ఆగస్ట్ 2న కేటీఆర్‌ ప్రెస్ మీట్ పెట్టి సుంకిషాల కూలిపోయింది అసెంబ్లీలో చర్చించడానికి కాంగ్రెస్ కి దమ్ములేదని చెప్పారని, పాలకపక్షం నిద్రపోతే ప్రతిపక్ష బాధ్యత BRS ఎందుకు తీసుకోలేదు కేటీఆర్‌ అని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డికి ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో 1000 కోట్లకు నోటీసులిచ్చిన HMDA అధికారి అరవింద్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు.

Recent

- Advertisment -spot_img