ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ ను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ మేరకు వారిద్దరికీ పార్టీ అధిష్టానం సమాచారం అందజేసింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 18 చివరి తేది. ఈ 29న ఎన్నికలు జరగనున్నాయి.