– బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు కౌంటర్
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ చలో మేడిగడ్డకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పార్టీ నేతలంతా రేపు మేడిగడ్డకు వెళ్లనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ మాత్రమే కాదని.. నిరూపించే ప్రయత్నం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ చలో ‘పాలమూరు రంగారెడ్డి’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. పాలమూరు – రంగారెడ్డి పర్యటనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. రేపు (శుక్రవారం) పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యటనకు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్ నుంచి బీఆర్‌ఎస్ నేతలు బయలుదేరనున్నారు. ఏడు బస్సుల్లో 150 మంది నేతలు మేడిగడ్డకు పయనంకానున్నారు. మధ్యాహ్నం భూపాల పల్లిలో లంచ్ చేయనున్నారు. సాయంత్రం మేడిగడ్డ వద్ద కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రిటైర్డ్ ఇంజినీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.