Homeహైదరాబాద్latest Newsమాట మార్చిన కాంగ్రెస్​.. మరో గ్యారెంటీ బంద్​

మాట మార్చిన కాంగ్రెస్​.. మరో గ్యారెంటీ బంద్​

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తాము అధికారంలోకి వస్తే వరిపంటకు రూ. 500 బోనస్​ ఇస్తామని కాంగ్రెస్​ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆరు గ్యారెంటీల్లోనే ఈ అంశాన్ని చేర్చింది. ఎన్నికల ప్రచారసభల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా వరికి బోనస్​ ఇస్తామని.. కాబట్టి.. వడ్లు ఇప్పుడే అమ్ముకోవద్దని కూడా చెప్పారు. దీంతో చాలా మంది రైతులు వడ్లు అమ్ముకోలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈ హామీపై కాంగ్రెస్​ నేత కోదండరెడ్డి మాట మార్చారు. ఒకవేళ వరికి మద్దతు ధర (ఎంఎస్ పీ) లేకపోతే వరికి రూ. 500 బోనస్​ ఇస్తామని తాము చెప్పామన్నారు. అయితే ఇప్పుడు వరికి ఓపెన్​ మార్కెట్​లో 2600 ధర పలుకుతోంది కాబట్టి తాము రూ. 500 బోనస్​ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. కాగా కోదండరెడ్డి ప్రకటన పట్ల రైతులు, రైతు సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఆరు గ్యారెంటీల్లో ఎటువంటి షరతులు విధించకుండా ఇప్పుడు రోజుకో రూల్​ ఎందుకు పెడుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img