బీహార్ లోక్ సభ సీట్ల కేటాయింపుపై ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల నేతలు ప్రకటన విడుదల చేశారు. పూర్నియా, హాజీపూర్‌తో సహా 26 స్థానాల్లో ఆర్జేడీ అభ్యర్థులు పోటీ చేయనుండగా 9 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. 5 నియోజకవర్గాల్లో వామపక్షాలు పోటీ చేయనున్నాయి.
కతిహార్, కిషన్‌గంజ్, పాట్నా సాహిబ్, ససారం, భగల్‌పూర్, పశ్చిమ చంపారన్, ముజఫర్‌పూర్, సమస్తిపూర్, మహారాజ్‌గంజ్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. బెగుసరాయ్, ఖగారియా, ఆర్హ్, కరకత్, నలంద నుంచి వామపక్షాలు పోటీ చేయనున్నాయి. మిగతా 26 స్థానాల్లో ఆర్జేడీ పోటీకి దిగనుంది.అటు ఎన్డీఏ కూటమిలో బీజేపీ 17 సీట్లు, జేడీయూ 16, జితన్ రామ్ మాంజీ పార్టీ హెచ్‌ఏఎమ్ ఒక సీటు, ఆర్‌ఎల్‌ఎస్పీ ఒక సీటు, చిరాగ్ పాశ్వాన్ లోక్‌జనశక్తి పార్టీ 5 సీట్లలో పోటీ చేయనున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ (7.7) కంటే ఆర్జేడీకే (15.36) ఓట్ల శాతం ఎక్కువగా ఉంది.