తమ ప్రభుత్వం గిరిజనలు ఆదుకున్నప్పటికీ పూర్తి మద్ధతు ఇవ్వలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో గురువారం జరిగిన మహబూబాబాద్ లోక్ సభ నియోజకర్గ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. అసలు అధికారంలోకి వస్తదని కాంగ్రెస్ ఊహించలేదని అందుకే ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చిందన్నారు.
బీఆర్ఎస్ పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చినట్లు కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ అబద్ధాల ముందు బీఆర్ఎస్ ఓడిపోయిందని.. పనుల కంటే ప్రచారం పైన ఫోకస్ చేసి ఉంటే గెలిచే వాళ్లమని వ్యాఖ్యానించారు.