తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు నొక్కాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది అని హరీష్ రావు ఆరోపించారు. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ నుండి విడుదల అయిన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంతి రెడ్డి రాష్ట్రంలో వంద రోజుల్లో అమలు చేస్తానని చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు చేయమన్నందుకు మా గొంతు నొక్కే ప్రయత్నం చేసాడు అని హరీష్ రావు అన్నారు. పోలీస్ స్టేషన్లు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులాగా తయారయ్యాయి.. ఎఫ్‌ఐఆర్‌లు కూడా గాంధీ భవన్లో తయారు అవుతున్నాయి అని హరీష్ రావు విమర్శించారు. మూసి బాధితుల పక్షాన నిలబడ్డందుకు, హైడ్రాతో పేద ప్రజలను ఆగం చెయ్యకమాన్నందుకు మాపై అక్రమ కేసులు పెట్టి 12 గంటలుగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించావ్ అని ఆరోపించారు. రాష్ట్రంలో ఇదేనా ని ప్రజాపాలన అంటే అని రేవంతి రెడ్డిపై హరీష్ రావు మండిపడ్డారు.