Homeహైదరాబాద్latest Newsరాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది : జేపీ నడ్డా

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది : జేపీ నడ్డా

తెలంగాణ రాష్ట్రంలో నేడు సరూర్‌నగర్‌ స్టేడియంలో కాంగ్రెస్‌ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ నిర్వహించిన నిరసన సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. మాయల ఫకీర్‌లా రేవంత్‌ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. అధికారాన్ని కాంగ్రెస్ తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని..బీజేపీ పార్టీ మాత్రం ప్రజల అవసరాలు తీర్చేందుకు ఉపయోగిస్తోందన్నారు. దేశంలో ఆరు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. 19 రాష్ట్రాల్లో కమలం వికసిస్తోంది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. రేవంత్‌కి అతని మీదే నమ్మకం లేదు. ఇక ప్రజలకు ఏమీ భరోసా కల్పిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో తెలంగాణలోని అన్ని వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వారందరికీ బీజేపీ అండగా నిలుస్తోంది అని జేపీ నడ్డా తెలిపారు.

Recent

- Advertisment -spot_img