HomeరాజకీయాలుCongress​ అధికారంలోకి రావడం ఖాయం

Congress​ అధికారంలోకి రావడం ఖాయం

– సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఇదే నిజం, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం, తుప్పగూడలో జరిగిన పార్టీ బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాల బూటకపు మాటలను తిప్పి కొట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు భట్టి విక్రమార్క పిలుపిచ్చారు. తెలంగాణ ఆర్థిక పరంగా బలమైన రాష్ట్రం అయినందున సుభిక్షమైన పాలన అందించాలన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img