– వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పట్నం సునీతారెడ్డి
ఇదేనిజం, శేరిలింగంపల్లి : కులమతాలకతీతంగా అన్ని మతాలను గౌరవించే ఏకైక ప్రభ్యత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని పేద ప్రజల అభ్యున్నతికి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పట్నం సునీతారెడ్డి అన్నారు. గురువారం సత్య లక్ష్మీనగర్ పాస్టర్ వందన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాస్టర్ల ఆత్మీయ సమ్మేళనంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్‌గౌడ్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వీరేందర్‌గౌడ్, ఇలియస్ షరీఫ్, శేరిలింగంపల్లి కార్డినెటర్ రఘునందన్ రెడ్డి, టీపీసీసీ లేబర్ సెల్ చైర్మన్ గా సంజీవరెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణముదిరాజ్, జాయింట్ సెక్రటరీ తిరుపతి, ఉపాధ్యక్షులు దినేష్ రాజ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజన్, యాదయ్యగౌడ్, పాస్టర్లు పాల్ ప్రసాద్, సతీశ్, శామ్యూల్, వివేక్ పాల్గొన్నారు.