Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో అయన మాట్లాడుతూ.. షోలాపూర్ అభ్యర్థి చేతన్ మంచి వ్యక్తి అని అతనికి ఓటు వేసి గెలిపించాలని కోమటిరెడ్డి తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. ఈ పధకం ద్వారా రాష్ట్రంలో కోట్లాది మంది ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు అని తెలిపారు. రైతులకు రెండు లక్షల రుణాలు మాఫీ చేశామన్నారు. నిరుద్యోగులకు 50 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

Recent

- Advertisment -spot_img