– గజ్వేల్లో 8 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కేసీఆర్
– కొడంగల్, కామారెడ్డిలో రేవంత్ ముందంజ
– మంత్రులు పువ్వాడ, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి వెనకంజ
– ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలో దూసుకుపోతున్న కాంగ్రెస్
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. ఆదివారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా దాదాపు సగానికిపైగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లీడ్లోకి వచ్చింది. ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ ముగిసేనాటికి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కనిపిస్తోంది. గజ్వేల్లో సీఎం కేసీఆర్ 8,822 ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక కామారెడ్డి, కొడంగల్ నియోజకవర్గంలో మూడో రౌండ్ ముగిసే సరికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 4,389 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తొలుత ముందజలో ఉండగా.. ఆ తర్వాత రౌండ్ బీఆర్ఎస్ అభ్యర్థి నుంచి గంగుల కమలాకర్ లీడ్లోకి వచ్చారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఖమ్మం జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాలుగో రౌండ్ ముగిసే నాటికి 12 వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.