Homeఫ్లాష్ ఫ్లాష్దత్తాత్రేయపై కాంగ్రెస్ నాయకుల దాడి

దత్తాత్రేయపై కాంగ్రెస్ నాయకుల దాడి

బీజేపీ సీనియర్‌ నాయకుడు, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు చేదు అనుభవం. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దత్తాత్రేయపై దాడి చేశారు. బడ్జెట్‌ స్పీచ్‌ అనంతరం బయటకు వెళ్తోన్న దత్తాత్రేయపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దాడి చేశారు.

హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ నెల 22 సోమవారం నాడు ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు.

నేడు తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు సభ సమావేశమైన వెంటనే ప్రతిపక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రి నేతృత్వంలోని కాంగ్రెస్ సభ్యులు తమ సీట్ల నుంచి లేచి నినాదాలు చేశారు.

గవర్నర్‌ అసెంబ్లీలో ప్రసంగం చివర్లో ఉండగా.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో గవర్నర్ తన ప్రసంగంలోని చివరి లైన్లను మాత్రమే చదివి, ప్రసంగం మొత్తం చదివినట్లుగా భావించాలని పేర్కొన్నారు.

గవర్నర్‌ ప్రసంగంపై కాంగ్రెస్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెల్లడించిన విషయాలన్ని అబద్ధాలని ఆరోపించారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సమస్యను ప్రసంగంలో చేర్చలేదన్నారు.

స్పీచ్‌ ముగించిన అనంతర దత్తాత్రేయ తన కారు దగ్గరకు వెళ్తుండగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభలో కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తనను ఖండించారు. ఇక గవర్నర్‌పై దాడి చేసిన ఎమ్మెల్యేలను మార్చి 20 వరకు సస్పెండ్‌ చేశారు.

Recent

- Advertisment -spot_img