Homeహైదరాబాద్latest Newsనూతన తహసీల్దార్‌తో కాంగ్రెస్ నేతల భేటీ

నూతన తహసీల్దార్‌తో కాంగ్రెస్ నేతల భేటీ

ఇదే నిజం, ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలానికి తహసీల్దార్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మేదరమెట్ల శైలజతో మండల కాంగ్రెస్ నాయకులు శుక్రవారం భేటీ అయ్యారు. అనంతరం ఆమెను శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌తో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కూరెల్లి సతీష్ మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన ఇనుగుర్తి మండలంలో సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. తాసీల్దార్ స్పందిస్తూ అందరి సహకారంతో పరిష్కారంలో ముందుంటానన్నారు. తహసీల్దార్‌ను కలిసిన వారిలో గంజి రాజేందర్ రెడ్డి, చిన్నాలకట్టయ్య, రాము ఉన్నారు.

Recent

- Advertisment -spot_img