ఇదేనిజం, పటాన్‌చెరు : మెదక్ కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్ దక్కించుకున్న నీలం మధును సిద్దిపేట కాంగ్రెస్ నేతలు అభినందించారు. శనివారం కాంగ్రెస్ నేతలు దాస అంజయ్య, సొప్పదండి చంద్రశేఖర్, ముద్దం లక్ష్మి, లింగం, భిక్షపతి తదితరులు నీలం మధును మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మధు విజయానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామన్నారు.