ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, జైరాం రమేశ్ పెదవి విరిచారు. కాంగ్రెస్ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు మోదీ మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఒత్తిళ్లకు బెదరబోమన్నారు. ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా బోగస్, బూటకమని అన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ స్పందిస్తూ..సిద్దూ మూసేవాలా పాట 295 విన్నారా అని ఎదురు ప్రశ్నించారు. ‘2004 లో వాజ్‌పేయీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా ఇలానే జరగబోతోంది. ఇండియా కూటమికి 295 సీట్లు పక్కా’ అని అన్నారు.