Homeహైదరాబాద్latest Newsఏపీ సీఎం చంద్రబాబుపై సీరియస్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఏపీ సీఎం చంద్రబాబుపై సీరియస్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతించకపోవడం పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏపీకి చెందిన ప్రజాప్రతినిధుల లేఖలతో తెలంగాణలోని పలు పుణ్యక్షేత్రాలకు భక్తులు వస్తే వారికి దర్శనం కల్పిస్తున్నామన్నారు. మరి తెలంగాణకు చెందిన భక్తులు ప్రజాప్రతినిధుల లేఖలతో తిరుమలకు వస్తే దర్శనానికి ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్లు తెలంగాణలో వ్యాపారం చేసుకున్నారని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్లు వ్యాపారం చేసుకున్నారని అనిరుధ్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులను తిరుమలలో శ్రీవారి దర్శనానికి అనుమతించకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలతో ఏపీ ప్రభుత్వం నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలకు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కోరారు.

Recent

- Advertisment -spot_img