తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విరాళం ప్రకటించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారుల రెండు నెలల జీతాన్ని ఇస్తామని చెప్పారు. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.