Homeఫ్లాష్ ఫ్లాష్కాంగ్రెస్​వి పెయిడ్ సర్వేలు

కాంగ్రెస్​వి పెయిడ్ సర్వేలు

– బూటకపు హమీలతో మోసం చేస్తున్నది
– బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు

ఇదే నిజం, హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ పెయిడ్‌ సర్వేలతో జనాలను మోసం చేస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ బూటకపు హామీలతో మోసం చేస్తోందని విమర్శించారు. కౌలు రైతులకు రైతు భరోసా అనేది సాధ్యం కాదని చెప్పారు. సాధ్యం కాదని తెలిసీ రైతుభరోసా ఇస్తామని చెప్పి ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్ర ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీకి ఎప్పుడూ 60 సీట్లు రాలేదు. గతంలోనూ ఉమ్మడి రాష్ట్రంలో కోస్తాంధ్ర, రాయలసీమ సీట్లతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది’అని లక్ష్మణ్‌ అన్నారు.

Recent

- Advertisment -spot_img