Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్ పార్టీ మొదటి సంవత్సరంలోనే 1 లక్ష 27 వేల కోట్లు అప్పు చేసింది :...

కాంగ్రెస్ పార్టీ మొదటి సంవత్సరంలోనే 1 లక్ష 27 వేల కోట్లు అప్పు చేసింది : హరీష్ రావు

బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో 4 లక్షల 17 వేల కోట్లు అప్పు చేస్తే.. కాంగ్రెస్ పార్టీ మొదటి సంవత్సరంలోనే 1 లక్ష 27 వేల కోట్లు అప్పు చేసింది అని హరీష్ రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన 72 వేల కోట్లు అప్పు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ల ద్వారా వచ్చిన 11 వేల కోట్ల అప్పు, భట్టి విక్రమార్క గారు కలిపిన 15 వేల కోట్లు మొత్తం లక్ష కోట్లు బీఆర్ఎస్‌కు సంబంధం లేని అప్పును కలిపారు అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ శ్వేతా పత్రంలో చూపిస్తున్న 6.71 లక్షల కోట్ల అప్పులో.. మేము తీసుకోని అప్పు, ప్రభుత్వం కట్టాల్సిన అవసరం లేని అప్పు మొత్తం తీసేస్తే బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో అచ్చంగా చేసిన అప్పు 4.17 లక్షల కోట్లు మాత్రమే అని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి సంవత్సరంలోనే 1.27 లక్షల కోట్లు అప్పు చేసింది హరీష్ రావు ఆరోపించారు.

Recent

- Advertisment -spot_img