Homeజిల్లా వార్తలుపోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడి బర్త్‌డే కేక్ కటింగ్.. వట్ పల్లి ఎస్సై లక్మన్...

పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడి బర్త్‌డే కేక్ కటింగ్.. వట్ పల్లి ఎస్సై లక్మన్ పై వేటు..!

ఇదేనిజం, సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి లోని వట్ పల్లి పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడి బర్త్‌డే కేక్ కట్ పోలీసులు చేసారు. ఆందోల్ నియజవర్గం వట్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతాప్ రమేష్ జోషి పుట్టిన రోజు సందర్భంగా వట్‌పల్లి SI లక్ష్మణ్, కానిస్టేబుల్స్ అందరూ కేక్ కట్ చేసి రమేష్ జోషికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
వట్ పల్లి ఎస్సై లక్మన్ పై వేటు
పోలీస్ స్టేషన్ లో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ జ్యోషి బర్త్ డే వేడుకలు ఎస్సై మరియు సిబ్బంది నిర్వహించారు. పోలీస్ స్టేషన్ లో బర్త్ డే వేడుకలు జరపడంపై ఉన్నత అధికారులు సీరియస్ అయ్యారు. వట్ పల్లి ఎస్సై నీ సంగారెడ్డి విఆర్ కు పంపిన హైదారాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ… సిబ్బంది పాత్ర పై విచారణ చేపట్టారు.

Recent

- Advertisment -spot_img