తెలంగాణ రాష్ట్రంలో వరి మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టారు అంటూ హరీశ్ రావు అన్నారు. రైతు ధాన్యం సకాలం లో కొనడం , మద్దతు ధరకు 500 బొనస్ ఇవ్వడం అంటే..మభ్య పెట్టి, అబద్ధాలు చెప్పి, తిమ్మిని బమ్మిని చేసి అధికారం లోకి రావడం కాదు రేవంత్ రెడ్డి గారు..అంటూ చురకలు అంటించారు. రైతులు రోడ్డు ఎక్కకుండా ఇచ్చిన మాట ప్రకారం మద్దతు ధర పై 500 బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్ రావు అన్నారు. ఎన్నికల హామీలను ఎగవేయటమే కాంగ్రెస్ పార్టీ నైజం అని హరీశ్ రావు మండిపడ్డారు.