కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకు 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మరింది. అందరికీ రుణమాఫీ చేస్తామని రేవంత్ గొప్పలు చెప్పారు. రుణమాఫీ కాని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు’ అని అన్నారు.