Homeరాజకీయాలురాష్ట్రానికి కాంగ్రెస్​ ప్రత్యేక పరిశీలకులు..

రాష్ట్రానికి కాంగ్రెస్​ ప్రత్యేక పరిశీలకులు..

– హీటెక్కిన తెలంగాణ రాజకీయం
– తమకే మెజారిటీ వస్తుందని కాంగ్రెస్​ ధీమా
– అందరూ అప్రమత్తంగా ఉండాలని అధిష్ఠానం ఆదేశం
– అభ్యర్థులందరికి ఏఐసీసీ దిశానిర్దేశం.!

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ఆదివారం నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. ఓవైపు ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ వస్తుందని కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంది. అయినా సరే అందరూ అప్రమత్తంగా ఉండాలని పార్టీ అధిష్ఠానం నేతలకు సూచించినట్లు సమాచారం. కౌంటింగ్‌కు ముందు అభ్యర్థులు ఎవరూ చేజారకూడదని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఉండేందుకు అధిష్ఠానం చర్యలు చేపట్టింది. పార్టీ అభ్యర్థులందరినీ హైదరాబాద్‌ రప్పించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. నగరంలోని హోటల్‌ తాజ్‌ కృష్ణలో అభ్యర్థులకు ఏఐసీసీ ప్రతినిధులు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరగనున్న 49 కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక పరిశీలకులను ఏఐసీసీ నియమించింది. వీరిలో చిదంబరం, సుశీల్​కుమార్​ షిండే, రణదీప్​ సూర్జేవాలాతో పాటు మరో ఇద్దరు ముఖ్యనేతలు ఉన్నట్లు తెలస్తుంది. ఎన్నికల ఏజెంట్‌కు ఎమ్మెల్యే ధ్రువపత్రం ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ను కలిసి కోరారు. అయితే అలాంటి వెసులుబాటు ఏదీ లేదని ఆయన వారికి సూచించినట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img