ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో గత పాలకవర్గం ప్రధాన రహదారి డివైడర్ మధ్యలో నాటిన కోనోకార్పస్ చెట్లు గత పాలకవర్గం నాటింది. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కోనోకార్పస్ చెట్లను తొలగించాలని గతంలో అనేకసార్లు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో తోపాటు మండల రెవెన్యూ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందించిన అధికారులు స్పందించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ప్రభుత్వ అధికార యంత్రాంగం అప్రమత్తమై ప్రజలకు హాని కలిగించే కోనోకార్పస్ చెట్లను యుద్ధప్రాతిపదికన తొలగించాలని బీజేపీ నాయకులు పోతుగల్ గ్రామ శక్తి కేంద్రం ఇన్చార్జ్ చీకోటి మహేష్ డిమాండ్ చేశారు.