నేటి నుంచి వరుసగా దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సెలవులు ప్రకటించింది. ఈ ఏడాది దసరా పండుగ రెండో శనివారం వస్తుందని అందరికీ తెలిసిందే. అక్టోబర్ 10, 11 తేదీలు ఎప్పటిలాగే బ్యాంకులకు సెలవులు వచ్చాయి. అయితే వివిధ రాష్ట్రాల్లోని మరికొన్ని బ్యాంకులకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, అస్సాం మరియు బెంగాల్‌లలో అన్ని బ్యాంకులకు వరుసగా అక్టోబర్ 10, 11, 12 మరియు 13 తేదీలలో సెలవులు ఇవ్వబడ్డాయి. ఈశాన్య రాష్ట్రాలలో సిక్కిం ఒకటి. ఈ రాష్ట్రంలో కూడా వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. అక్టోబర్ 11, 12, 13, 14 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఇచ్చారు.