Homeహైదరాబాద్latest Newsప్రధాని మోదీ హత్యకు కుట్ర.. చంపేస్తామని బెదిరింపు మెసేజ్..!

ప్రధాని మోదీ హత్యకు కుట్ర.. చంపేస్తామని బెదిరింపు మెసేజ్..!

ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని శనివారం మెసేజ్‌ వచ్చిందని ఓ అధికారి తెలిపారు. ముంబై ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్ వాట్సాప్ నంబర్‌కు కొన్ని గంటల క్రితం ఈ సందేశం పంపినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు ఐఎస్‌ఐ ఏజెంట్లు, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు కుట్ర పన్నుతున్నట్లు పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌ నుంచి ప్రధానిని చంపుతామని బెదిరింపు సందేశం పంపినట్లు దర్యాప్తులో తేలింది. మెసేజ్ పంపిన వ్యక్తి మతి భ్రమించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Recent

- Advertisment -spot_img