ఏపీ కానిస్టేబుల్ ఫైనల్ పరీక్షల తేదీలను ప్రకటించారు. జూన్ 1, 2025న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించబతుందని SLPRB ప్రకటన జారీ చేసింది. ఈ పరీక్షలు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలలో జరుగుతాయి.మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టుల కోసం 4,59,182 మంది ప్రిలిమినరీ పరీక్ష రాయగా, 95,208 మంది ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT) మరియు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) కోసం అర్హత సాధించారు. వీరిలో 38,190 మంది ఫైనల్ రాత పరీక్షకు క్వాలిఫై అయ్యారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు SLPRB అధికారిక వెబ్‌సైట్ (slprb.ap.gov.in) నుంచి వారి హాల్ టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాగే, పరీక్ష కేంద్రం, సమయం, మరియు ఇతర సూచనలను హాల్ టికెట్‌లో తనిఖీ చేసుకోవడం ముఖ్యం. ఏదైనా సందేహాలు ఉంటే, SLPRB హెల్ప్‌లైన్ నంబర్లు (9441450639, 9100203323) లేదా ఈమెయిల్ (mail-slprb@ap.gov.in) ద్వారా సంప్రదించవచ్చు.